top of page

ఏ ప్రదేశం లో జపం చేస్తే మంచిది ( ఎక్కువ ఫలితం వస్తుంది ).

నదీ తీరాలు, క్షేత్రాలు, కొన్ని సిద్ద క్షేత్రాలు ( శ్రీశైలం, కాశీ ) వంటి ప్రదేశాలలో వేరు వేరు శక్తులు ఉంటాయి. ఇలాంటి క్షేత్రాలలో మంత్ర సిద్ధి బాగా కలుగుతుంది.

జపం చేయడానికి కాలాన్ని, ప్రదేశాన్ని, దిశని ముఖ్యంగా తీసుకోవాలి 
ధర్మాన్ని సాధించేందుకు ఈ శరీరం మొట్టమొదటి సాధనం కాబట్టి ఈ శరీరం పుట్టిన ప్రదేశం చాల గొప్పది, అదే విధంగా  గ్రహణ సమయములో జపం చేస్తే కొన్ని రేట్ల రెట్టింపు ఫలం వస్తుంది, మన జన్మ తిథులయందు మరియు దేవతా వృక్షాల క్రింద జపం చేయడం చాల ఫలితాన్ని ఇస్తుంది.
మారేడు  - సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం
రావి చెట్టు - సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం 
వేప - సాక్షాత్తు పార్వతి దేవి స్వరూపం
మేడి చెట్టు - దత్తాత్రేయ స్వరూపం 
జపాన్ని తూర్పు , ఉత్తరం దిశలయందు కూర్చొని చేయవలెను.
గాయత్రి జపం మాత్రం సంధ్య సమయంలో పడమర దిశ యందు కూర్చొని చేయవలెను.
ముఖ్యంగా జపం భూమిపైనా మాత్రమే చేయటం చాల ఉత్తమం. 
bottom of page