దీప దానం
దీప దానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి వెలిగించి చేయాలా లేక అలానే చేయాల ా అని తెలియని వారు చాలా మంది ఉంటారు దానికి సంబంధించిన వివరణ..

ఏ మాసంలోనైనా మంచి రోజున దీప దానం చేయవచ్చు.
కార్తీక మాసంలో ఇచ్చే దీప దానం విశేష ఫలితాలను ఇస్తుంది. ఎందుకనగా కార్తీక మాసపు నామం (పేరు) కృత్తికా నక్షత్రం వలన వచ్చినది. కృత్తికా నక్షత్రం (అగ్ని) పూర్వక నక్షత్రం.
అందువలన కార్తీక మాసపు క్షీరాబ్ధి ద్వాదశి లేదా పూర్ణిమ రోజున అయితే ఉత్తమం లేదా మంచి రోజులలో కూడా దీపదానం చేయవచ్చు.
దీపము జ్ఞానానికి సంకేతముగా, పరం బ్రహ్మ స్వరూపంగా చెపుతారు. అనగా మనలో వున్న అజ్ఞానం అనే అంధకారాన్ని తుడిచి వేసి, జ్ఞానమనే వెలుతురును ప్రసాదించేదిగా అర్థం.
ఇక దీప దానం ఎలా చెయ్యాలంటే, స్థోమత వుంటే, వెండి ప్రమిదలు లేదా ఇత్తడి లేక బియ్యం పిండి లేదా గోధుమ పిండి లేదా చివరకు మట్టి ప్రమిదలు కల ( కనీసం రెండు దీపాలు వుంటే ఉత్తమం) దీప దానం చేయాలి. స్టీలు దీపాలు అంత శ్రేష్టము కాదు. పిండి తో చేసే దీపాలు అయితే ఆపిండి శుచి శుభ్రముగా వుండాలి. పిండిని, ఆవుపాలతో తడిపి చేసిన ప్రమిదలయితే మంచివి.
దీపదానం విష్ణు సంబంధమైన దేవాలయములలో కాని శివుని దేవాలయములలో కాని దానం ఇవ్వాలి.
మొదట ఆ దీపములను ఒక పళ్ళెములో వుంచి, నెయ్యి లేదా నూగుల నూనె వేసి, ఆ తరువాత ఒక్కొక్క దీపంలో రెండు వత్తులు వేసి, దీపములను వెలిగించి, పసుపు కుంకుమలు మరియు పుష్పలతో అలంకరించి, వాటికి ధ్యాన శ్లోకముతో నమస్కారము సమర్పించి వాటిని ఒక సద్బాహ్మణునకు, సాయంత్రం వేళ 5.30 నుంచి 7.00 గంటల సమయం లోపల సదక్షిణ తాంబూలములతో దానం చేయాలి.
సంకల్ప పూర్వకముగా దానం చేస్తే ఇంకా మంచిది.
అలాగే, బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, కూరగాయలు, నెయ్యి వగైరాలతో ఆ బ్రాహ్మణునికి స్వయం పాకం పదార్థాలు దానం ఇవ్వాలి.
శ్లోకం:
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం"
"దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ"
అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి.
అనగా, సర్వ జ్ఞానస్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖాలనొసగే, దీపమును దానమిచ్చుచున్నాను, దీనివలన నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం.
ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపముల దానం చేస్తే విద్య, దీర్ఘాయువు, స్వర్గప్రాప్తి లభిస్తుంది.
దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.
ఇదంతా వీలు కాకుంటే, స్వచ్ఛమైన నువ్వుల నూనె కాని, నెయ్యికాని దేవాలయములలో దీపారాధన చేయడానికి దానంగా కూడా ఇవ్వచ్చు. దానికి తగిన ఫలితము వస్తుంది.
కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితోగానీ, గోధుమపిండితోగానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే... పసుపునుపూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు...
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం"
"దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ"-
అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే.. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.
"దీపదానం మహిమను గురించి వివరించే కథ"
పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్నఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ... తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేదికాదు. పరమలోభి.
శుచిశుభ్రత లేకుండా జీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.
అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.