top of page

అఘోరా శైవ సాధువులలో ఒక రకమైన సన్యాసులు. అఘోరాల జీవనసరళి, ఆచార వ్యవహారాలు మిక్కిలి భయానకంగా ఉంటాయి.

flat,1000x1000,075,f.u4.jpg

శివ శివ శివ శంభో ---- హర హర హర శంభో -
మహాదేవ శంభో -------

మనం తరచూ అఘోరా సాధువులు అని వింటూనే ఉంటాము. వీరికి ఎవరి పట్ల కోపం , ద్వేషం, ప్రేమ ఉండవు, మరియు ఈ అఘోరా సాధువులు అన్న పదం శ్లోకాలతో, పురాణాలతో సంబంధం ఉందని కూడా మనకు తెలుసు. ఎక్కువగా శరీరాన్ని చితా భస్మంతో కప్పుకుని భయం గొల్పే వేషధారణతో ఉండే వీరు నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు, వీరికి అతీంద్రియశక్తులు లేదా దైవిక శక్తులు కలిగి ఉన్నవారిగా ప్రజలు నమ్ముతారు.చిత్ర విచిత్ర వేషధారణ అయిన సన్యాసులు అఘోరులుగా తలపిస్తూ , అరుదుగా కనిపిస్తారు. ఇంత భయానక జీవనాన్ని గడుపుతున్న వీరు పరిశుద్దాత్ములుగా చెప్పబడుతున్నారు.

bottom of page