మంత్రం అనగా ఏమిటి?
"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "
మర ల మరల మననం చేయటం వల్ల మనల్ని రక్షిస్తుంది కాబట్టి దానిని మంత్రం అంటారు. సూర్యోదయానికి ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు.

సూర్యోదయానికి ముందు లేచి, మనకు కావాల్సింది భావన చేసుకొని తదనుగుణంగా
మంత్రాన్ని పఠిస్తే అది కార్య రూపం దాల్చుతుంది. బ్రాహ్మీ ముహూర్తం చాల చాల అనుకూలమయిన సమయం.
మనకు కావలసిన దానిని భావన చేసుకొని మంత్రాన్ని సాధనంగా చేసుకోవాలి
ఎక్కువగా మనకు ఏది కావాలో తెలియకపోవటం , ఏది అవసరం లేదో దానిని కోరుకోవటం ,
ముఖ్యంగా ఎదుటి వారి కీడుని కోరుకోవడం జీవితానికి శాపంగా మారుతాయి కాబట్టి
మనకు ఏది కావాలా స్పష్టంగా భావన చేసుకోగలిగితే అన్ని సాధ్యమే .
ప్రతి మంత్రానికి శక్తి ఉంది కానీ అది సాధన చేసే వ్యక్తి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
మనస్సు చాల చంచలమైనది కాబట్టి ఏకాగ్రతగా ధ్యానం, తపస్సు చేయటం చాల కష్టం
అయిన పని. మనస్సు ఏకాగ్రత కోసం ముందుగా సాధన చేయాలి.